విద్యార్థుల్లో మాదకద్రవ్యాలపై అవగాహన పెంపు,
అభ్యాస జూనియర్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూన్ 25 మన వార్త :యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు అల్వాల్ పోలీసులు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం అల్వాల్ లోని అభ్యాస జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. మాదకద్రవ్యాల వినియోగం శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని, జీవితాంతం ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలిపారు.
డ్రగ్స్‌కు బానిసైన విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతిని చదువులో వెనుకబడటంతో పాటు విద్యను మధ్యలోనే మానివేసే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. అంతేకాకుండా మాదకద్రవ్యాల కలిగి ఉండటం, వినియోగించడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు, అరెస్టులు, క్రిమినల్ రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు.
యువతను లక్ష్యంగా చేసుకుని కొందరు డ్రగ్ పేడ్లర్లు మాదకద్రవ్యాలను చాక్లెట్లు, క్యాండీలు లేదా ఇతర సాధారణ వస్తువుల రూపంలో పంపిణీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విద్యార్థులను అప్రమత్తం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే గోప్యంగా ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన 1908 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ సేవలను వినియోగించాలని సూచించారు.
కార్యక్రమం ముగింపులో విద్యార్థులతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించి, డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ తమ కళాశాల, సమాజాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై మాదకద్రవ్యాల నిర్మూలనకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
Medchal -Malkajgiri District
విద్యార్థుల్లో మాదకద్రవ్యాలపై అవగాహన పెంపు, అభ్యాస జూనియర్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని
