Telangana
కొండపాకలో ఘనంగా పోచమ్మ బోనాల ఉత్సవం
Quick Summary:
MURALI REPORTER
కొండపాక/సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ తల్లి బోనాల మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కొండపాక మండల తాజా మాజీ జడ్పీటీసీ శ్రీమతి అనంతుల అశ్విని ప్రశాంత్ పాల్గొని, అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఉత్సవానికి విచ్చేసిన తాజా మాజీ జడ్పీటీసీ అనంతుల అశ్విని ప్రశాంత్‌ను ముదిరాజ్ కుల పెద్దలు, సంఘ సభ్యులు ఘనంగా శాలువాతో సత్కరించి, గౌరవించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులసంఘం నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.