తండ్రి కోల్పోయిన కుటుంబానికి బీఆర్ఎస్ అండ - రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేత
అధైర్య పడొద్దు, కార్యకర్తలకు ఎప్పుడూ తోడుగా ఉంటాం" - సీనియర్ నాయకులు గొడవర్తి నర్సింహమూర్తి
వెంకటాపురం జూన్ 30 మనవార్త
ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సబక రామారావు గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తండ్రిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గొడవర్తి నర్సింహమూర్తి గురువారం పరామర్శించారు.ఈ సందర్భంగా కుటుంబ ఖర్చుల నిమిత్తం *రూ.10,000/-* ఆర్థిక సాయాన్ని ఆయన స్వయంగా అందజేశారు. అనంతరం నర్సింహమూర్తి మాట్లాడుతూ, "నిరుపేద కుటుంబాలకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కంటికి రెప్పలా ఆర్థికంగా అండగా ఉంటాం. అధైర్య పడొద్దు, పార్టీ ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది" అని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం వివేక్, బొల్లిన నర్సింహమూర్తి, అట్లూరి రఘురామ్, కానిబెల్లి శివాజీ, సమ్మయ్య, యలమటి శ్రీను, మంచర్ల నాగేశ్వరరావు, బట్ట నాగేందర్, పోడెం సురేష్, గ్రామ యువకులు, గ్రామస్తులు మరియు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Telangana
తండ్రి కోల్పోయిన కుటుంబానికి బీఆర్ఎస్ అండ - రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేత
Quick Summary:
కవిరాజు