మొహరం వేడుకల ఏర్పాట్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి: బీఆర్ఎస్ నేతల వినతి..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, జూన్ 15 మన వార్త : రాబోయే మొహరం వేడుకల సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని అషూర్ ఖానాల వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని బీఆర్ఎస్ నాయకులు అధికారులను కోరారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రజావాణి కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, 191 మచ్చ బొల్లారం డివిజన్ నాయకుడు సయ్యద్ అతిక్ పాషా ఆధ్వర్యంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అల్వాల్ సర్కిల్ ఏడిసి, యాదగిరి కి వినతిపత్రాన్ని అందజేశారు.
మొహరం వేడుకలకు వేలాదిగా భక్తులు హాజరయ్యే నేపథ్యంలో అషూర్ ఖానాల పరిసరాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, వీధి దీపాలు, రహదారుల మరమ్మతులు, డ్రైనేజీ వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లు తదితర మౌలిక సదుపాయాలను ముందస్తుగా కల్పించాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సయ్యద్ అతిక్ పాషా మాట్లాడుతూ, మతపరమైన వేడుకలు ప్రశాంతంగా, సౌకర్యవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రజల అవసరాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అల్వాల్ సర్కిల్ మైనారిటీ నాయకుడు సయ్యద్ ఆరిఫ్, 192 డివిజన్ సీనియర్ నాయకుడు రహమత్ ఖాన్, సయ్యద్ మొహ్సిన్, డోలి రమేష్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Medchal -Malkajgiri District
మొహరం వేడుకల ఏర్పాట్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి: బీఆర్ఎస్ నేతల వినతి..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని