అల్వాల్‌లో యువతి అదృశ్యం,లుక్‌అవుట్ నోటీసు జారీ చేసిన ఆల్వాల్ పోలీసులు..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, జూలై 28 మన వార్త : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 ఏళ్ల వివాహిత అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మహిళ ఆచూకీ కోసం లుక్‌అవుట్ నోటీసు జారీ చేసి, ప్రజల సహకారం కోరుతున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. అల్వాల్‌లోని లొతుకుంట ఇందిరానగర్ కాలనీ, ఇంటి నంబర్ 1-24-303లో నివాసం ఉంటున్న శ్యామల (25), భర్త బి. వెంకటేశ్వర్లు, ఈ నెల జూలై 5వ తేదీ మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో ఇంటి నుంచి ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయింది. ఇంట్లోనే తన మొబైల్ ఫోన్‌ను ఉంచి వెళ్లిన ఆమె, తన దుస్తులు మరియు వ్యక్తిగత వస్తువులను మాత్రం వెంట తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు, తెలిసిన ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ శ్యామల ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె భర్త బి. వెంకటేశ్వర్లు అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు క్రైమ్ నం. 662/2026 కింద మహిళ అదృశ్యమైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గతంలో కూడా శ్యామల ఇదే తరహాలో ఇంటి నుంచి వెళ్లిపోగా, అప్పట్లో నంద్యాల పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సమాచారం.
అదృశ్యమైన శ్యామల ఎత్తు సుమారు 5 అడుగులు, సాధారణ శరీరాకృతి, తెలుపు వర్ణం, నల్లని జుట్టు, నల్లని కళ్లు, అండాకార ముఖంతో ఉంటుందని పోలీసులు తెలిపారు.
శ్యామల ఆచూకీ తెలిసిన వారు వెంటనే అల్వాల్ పోలీస్ స్టేషన్ లేదా ఎస్‌ఐ దేవేందర్(8712554138)ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 8712663259, 8712554140 నంబర్లకు సమాచారం అందించినా తక్షణ చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
Medchal -Malkajgiri District
అల్వాల్‌లో యువతి అదృశ్యం,లుక్‌అవుట్ నోటీసు జారీ చేసిన ఆల్వాల్ పోలీసులు..
Quick Summary:
మన వార్త ప్రతి నిధి :అంతోని