కుటుంబ విలువలకు నిదర్శనంగా మర్రి దంపతుల 60వ వివాహ వార్షికోత్సవం..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూన్ 14మన వార్త : కుటుంబ బంధాలు, సంప్రదాయ విలువలను చాటిచెప్పే విధంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తల్లిదండ్రులు మర్రి అరుంధతి – లక్ష్మణ్ రెడ్డి దంపతుల 60వ వివాహ వార్షికోత్సవ వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు. మునీరాబాద్‌లోని ఒనవా ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమం రాజకీయ, సామాజిక ప్రముఖుల సమక్షంలో సందడిగా సాగింది.
ఈ సందర్భంగా దంపతులను ఘనంగా సన్మానించిన అతిథులు, వారి దాంపత్య జీవితం కుటుంబ వ్యవస్థకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. దంపతుల ఆశీస్సులు యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా తుర్కపల్లి బొల్లారం 190వ డివిజన్ అధ్యక్షుడు మహేష్ చెలిమెల కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్టీ నాయకులతో సమన్వయం చేస్తూ వేడుకల విజయవంతమైన నిర్వహణకు కృషి చేశారు. దంపతులకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన మహేష్ చెలిమెల, వారి 60 ఏళ్ల దాంపత్య బంధం సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
మచ్చ బొల్లారం మైనారిటీ నాయకుడు మహమ్మద్ జావిద్, రాచకొండ వెంకటేష్ తదితరులు పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కటింగ్, కుటుంబ సభ్యుల అభినందనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. చివరగా మర్రి కుటుంబ సభ్యులు హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Medchal -Malkajgiri District
కుటుంబ విలువలకు నిదర్శనంగా మర్రి దంపతుల 60వ వివాహ వార్షికోత్సవం..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని