మచ్చ బొల్లారంలో మొహరం వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ నర్ల సురేష్.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 27 మన వార్త : మచ్చ బొల్లారం ప్రాంతంలో మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని అతిక్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ గ్రహీత డాక్టర్ నర్ల సురేష్ హాజరై ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన పీర్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ నర్ల సురేష్ మాట్లాడుతూ, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా జీవించాలని ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారని అన్నారు. అన్ని మతాల ప్రజలు తమ పండుగలను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం నుంచి అందే నిధులతో పాటు తన వంతు సహాయ సహకారాలను కూడా ఎమ్మెల్యే అందిస్తున్నారని తెలిపారు.
మొహరం పర్వదినం త్యాగం, మానవత్వం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్న ఆయన, సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అన్ని మతాల ప్రజలు పరస్పర ప్రేమాభిమానాలతో కలిసి జీవించాలన్నారు. ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన అతిక్ పాషాను అభినందిస్తూ, ముస్లిం సోదరులకు మొహరం పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డోలి రమేష్, మధుసూదన్ రెడ్డి, జావిద్, రాజు, బషీరుద్దీన్, హరిత, శిల్ప, బీఆర్ఎస్ కార్యకర్తలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
Medchal -Malkajgiri District
మచ్చ బొల్లారంలో మొహరం వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ నర్ల సురేష్
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని
