Telangana
కాంగ్రెస్ నాయకులకు పిచ్చి ముదిరింది..
Quick Summary:
MURALI STAFF REPORTER
గజ్వేల్: సిద్దిపేట జిల్లా:సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ దేవాలయాలను సందర్శిస్తే, దానికి క్షుద్ర పూజలంటూ రంగు పులుముతున్న కాంగ్రెస్ నాయకులకు పిచ్చి పట్టిందని గజ్వేల్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎన్.సీ. సంతోష్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ రెడ్డి ఇటువంటి క్షుద్ర నాటకాలు, తాంత్రిక మాయాజాలం, క్రిమినల్ డ్రామాలకు తెరలేపిందని విమర్శించారు. కర్ణాటకలోని కొల్లూరు మూకాంబికా దేవాలయం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దివ్యక్షేత్రం అది. జగద్గురు ఆదిశంకరాచార్యులచే అభివృద్ధి చెందిన, అక్షరాభ్యాసాలకు మరియు విద్యాభ్యాసానికి ప్రసిద్ధి చెందిన ఆ ఆలయాన్ని "క్షుద్ర పూజల నిలయం" అని వ్యాఖ్యానించడం కోట్లాది మంది హిందువుల నమ్మకాలను హేళన చేయడమేనని, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం అత్యంత శోచనీయమని పేర్కొన్నారు. ప్రతిరోజూ వందలాది మంది ప్రజలను ముఖాముఖి కలిసి, వారి సమస్యలను పరిష్కరించే ఏకైక నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు అని, అలాంటి నాయకుడు ప్రజల చెడు కోరుకుంటాడని అనడం కాంగ్రెస్ నేతల వివేకహీనతకు నిదర్శనమన్నారు. మా నాయకుడిపై పిచ్చి ప్రేలాపణలు చేయడం మానేసి, ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను ఎలా నెరవేరుస్తారో ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.