Telangana
తెలంగాణ గ్రామీణ బ్యాంకు, వీడ్స్ సి.ఎఫ్.ఎల్ ఆధ్వర్యంలో బాధితులకు 20 లక్షల బీమా చెక్కుల పంపిణీ
Quick Summary:
MURALI STAFF REPORTER
సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు, వీడ్స్ సి.ఎఫ్.ఎల్ సంయుక్త ఆధ్వర్యంలో మరణించిన ఇద్దరి కుటుంబాలకు 20 లక్షల విలువైన ప్రమాద బీమా చెక్కులను మంగళవారం అందజేశారు. తోగుట మండల కేంద్రానికి చెందిన సిలివెరి మల్లేశం అనే కల్లుగీత కార్మికుడు వృత్తిరీత్యా ఈత చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు కిందపడి మరణించారు. దాంతో ఆయన భార్య, నామిని అయిన సిలివెరి లలితకు 20 లక్షల ప్రమాద బీమా చెక్కును అధికారులు అందజేశారు. అలాగే తోగుట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన రైతు చంద నర్సయ్య వ్యవసాయ పనుల్లో ఉండగా కరెంట్ షాక్‌కు గురై మరణించారు. ఆయన కుమారుడు, నామిని అయిన చంద కృష్ణకు 20 లక్షల బీమా చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంకులు అందించే వివిధ బీమా పథకాలపై అవగాహన పెంచుకొని, బీమా పొంది తమ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ రాజయ్య, తోగుట శాఖ మేనేజర్ జలంధర్, ఫీల్డ్ ఆఫీసర్ ప్రణీత్, క్యాషియర్ రవికుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు చందాపూర్ సర్పంచ్ చంద లావణ్య స్వామి, ఎస్.బి.ఐ. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంచార్జ్ శ్రీకాంత్, కృష్ణ, మరియు తోగుట వీడ్స్ సి.ఎఫ్.ఎల్ కౌన్సిలర్లు ఎ. శ్రీనివాస్, బి. స్వామి, సిహెచ్. రాజు తదితరులు పాల్గొన్నారు.