కరీంనగర్,జూలై 10 (మన వార్త ప్రతినిధి):
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సాంకేతిక నైపుణ్యాలు,పరిశోధనా ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో కరీంనగర్ సీతారాంపూర్‌లోని ఐవీవై (సీబీఎస్‌ఈ),సిద్ధార్థ విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం విజ్ఞాన ప్రదర్శన నిర్వహించనున్నారు.కృత్రిమ మేధ, రోబోటిక్స్,స్వయంచాలక సాంకేతిక వ్యవస్థలు,సైబర్ భద్రత,ఆధునిక సాంకేతికతలకు సంబంధించిన వినూత్న నమూనాలు,ప్రత్యక్ష ప్రదర్శనలు,విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.ఈ సందర్భంగా ఐవీవై విద్యాసంస్థల చైర్మన్ పసుల మహేష్,కో-చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ..భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు చిన్న వయస్సు నుంచే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.పుస్తకాల పరిజ్ఞానంతో పాటు ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ విజ్ఞాన ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ ప్రదర్శన ద్వారా విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం,సృజనాత్మకత,సమస్య పరిష్కార నైపుణ్యాలు మరింత పెంపొందుతాయని పేర్కొన్నారు.విద్యార్థులు,తల్లిదండ్రులు,విద్యాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థుల ఆవిష్కరణలను వీక్షించి ప్రోత్సహించాలని నిర్వాహకులు ఆహ్వానించారు.
Telangana
విద్యార్థుల ఆవిష్కరణల సందడి...రేపు ఐవీవై–సిద్ధార్థ విద్యాసంస్థల్లో విజ్ఞాన ప్రదర్శన..
Quick Summary:
రాజు ఇల్లంతకుంట మన వార్త