మంగాపురం కాలనీలో 25 లక్షల సీసీ రోడ్డు పనులకు శ్రీకారం,
మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూన్ 25మన వార్త : మచ్చ బొల్లారం డివిజన్ లోని మంగాపురం కాలనీలో 25 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఇటీవల డ్రైనేజీ పైప్‌లైన్ పనుల కారణంగా దెబ్బతిన్న ప్రధాన రహదారిని పునర్నిర్మించాలని కాలనీ వాసులు చాలా కాలంగా కోరుతున్న నేపథ్యంలో ఈ పనులను ప్రారంభించారు.
కాలనీలోని పలు అంతర్గత రహదారులకు అనుసంధానంగా ఉన్న ఈ ప్రధాన రహదారి దెబ్బతినడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారుల సహకారంతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు తమ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే రాకపోకలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మంగాపురం కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యూఏ) అధ్యక్షుడు రాకేష్ రావు, పెంటా రెడ్డి, ఎం. వెంకట్ రావు, ఎన్. రాజలింగం, చందర్ రావు, నారాయణ రావు, ఎల్. మనోహర్ రావు, ఈ. మనోహర్ రావు, బాలరామ్, సుధీర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ వర్మ, జగదీష్, విష్ణు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, లడ్డూ రెడ్డి, శ్రీశైలం యాదవ్, వెంకటేష్ గౌడ్, దేవా, డి. స్వామి, వెంకటేష్, నవీన్ తదితరులు హాజరై పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్, 190 & 191 డివిజన్ల ఇన్‌చార్జ్ రాజ్ జితేందర్ నాథ్ పాల్గొని పనుల పురోగతిపై పర్యవేక్షణ చేపట్టారు. మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు.
Medchal -Malkajgiri District
మంగాపురం కాలనీలో 25 లక్షల సీసీ రోడ్డు పనులకు శ్రీకారం, మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని
