వాసవి ఎన్‌క్లేవ్ పార్కులో ఊబకాయం అవగాహన, యోగా శిబిరం కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూన్ 15మన వార్త : భారతీయ యోగా సంస్థాన్ ఆధ్వర్యంలో వాసవి ఎన్‌క్లేవ్ పార్కులో ఐదు రోజుల పాటు నిర్వహించిన ఊబకాయం నివారణ అవగాహన మరియు యోగా శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ, ఊబకాయం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు భారతీయ యోగా సంస్థాన్ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రస్తుత జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల ఊబకాయం వేగంగా పెరుగుతోందని, దీనిని నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగా, వ్యాయామాన్ని తప్పనిసరిగా భాగం చేసుకోవాలని సూచించారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని తెలిపారు.
సమాజంలో ఆరోగ్యంపై చైతన్యం పెంచే ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సాజిద్, లింగారెడ్డి, మధుసూదన్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Medchal -Malkajgiri District
వాసవి ఎన్‌క్లేవ్ పార్కులో ఊబకాయం అవగాహన, యోగా శిబిరం కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని
