అల్వాల్‌లో యువతి అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూన్ 21 మన వార్త :అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం చిత్తరయ్య కాలనీలో నివసిస్తున్న 25 ఏళ్ల ప్రీతి సింగ్ అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై అల్వాల్ పోలీసులు మహిళ అదృశ్యం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీ సాయి ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ప్రీతి సింగ్ జూన్ 14 తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. అంతకు ముందు రాత్రి ఆమెకు భర్తతో కుటుంబ కలహాలు జరిగినట్లు తెలిసింది.
ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ వెంట తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు ఫోన్ చేసినప్పటికీ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.
మధ్యాహ్న సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆన్‌లైన్‌లోకి వచ్చిన ప్రీతి సింగ్ తన భర్తకు వాయిస్ మెసేజ్‌లు పంపి, పశ్చాత్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపినట్లు సమాచారం. అనంతరం మళ్లీ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
ఈ ఘటనపై అల్వాల్ పోలీసులు మహిళ అదృశ్యం కేసు నమోదు చేసి రాష్ట్రవ్యాప్తంగా లుక్‌అవుట్ నోటీసు జారీ చేశారు. ఎవరికైనా ఆమె ఆచూకీ తెలిసినట్లయితే వెంటనే అల్వాల్ పోలీస్ స్టేషన్‌ను 8712663259 లేదా 9493020244 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Medchal -Malkajgiri District
అల్వాల్‌లో యువతి అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని