తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి,,
టీజేఏసీ రాష్ట్ర సమన్వయకర్త పిట్టల రవీందర్..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూన్ 24 మన వార్త :తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులందరినీ ప్రభుత్వం అధికారికంగా గుర్తించి తగిన గౌరవం కల్పించాలని తెలంగాణ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త పిట్టల రవీందర్ డిమాండ్ చేశారు.
మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని బొల్లారంలో అల్వాల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వెనుక వేలాది మంది ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎలాంటి స్వార్థం లేకుండా అనేక మంది ఉద్యమకారులు తమ జీవితాలను తెలంగాణ సాధన కోసం అంకితం చేశారని, వారి నిరంతర కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం స్వాగతించదగిన పరిణామమని పేర్కొన్నారు. అయితే, ఉద్యమంలో నిజాయితీగా పనిచేసిన ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి, వారికి గుర్తింపు పత్రాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే, రాష్ట్ర సాధన కోసం పోరాడుతూ వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అల్వాల్ జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన.
ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు పుట్నాల కృష్ణ, ఏర్పుల దయాకర్, మంద శోభన్ బాబు, సుధీర్ కుమార్,సంతోష్ కుమార్, మంద ఆనంద్, నరసింహ, అనిల్ రాజ్, వెంకటేష్ యాదవ్, రామయ్య, ముత్యాలు, సురేష్ కుమార్, చెలిమెల మహేష్, కొత్తొల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఆత్మీయ వాతావరణంలో ముగిసింది...
Medchal -Malkajgiri District
తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి,, టీజేఏసీ రాష్ట్ర సమన్వయకర్త పిట్టల రవీందర్..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని