భారీ తూరలతో తాత్కాలిక వంతెన పూర్తి... రాకపోకలు పునరుద్ధరణ
వాజేడు జూలై 24 మనవార్త
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి, పెద్దగొల్లగూడెం మధ్య 163వ జాతీయ రహదారిపై ఇసుక వాగు వద్ద కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డును భారీ తూరలతో పునరుద్ధరించారు.3 రోజులుగా నిలిచిపోయిన వాహనాల రాకపోకలు గురువారం నుండి తిరిగి ప్రారంభమయ్యాయి. వాజేడు తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, పోలీసు అధికారుల పర్యవేక్షణలో బ్రిడ్జి నిర్మాణ సంస్థ సిబ్బంది రెండు వరుసల భారీ తూరలు ఏర్పాటు చేశారు. దీంతో తాత్కాలిక వంతెన నిర్మాణం పూర్తయింది.దీంతో ధర్మారం, పేరూరు, చండ్రుపట్ల సహా 25 గ్రామాల ప్రజలతో పాటు తెలంగాణ నుండి ఛత్తీస్గఢ్ కు వాహనాలు, ప్రయాణికుల రాకపోకలు సురక్షితంగా సాగుతున్నాయి. వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ తాత్కాలిక ఏర్పాటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
Telangana
భారీ తూరలతో తాత్కాలిక వంతెన పూర్తి.. రాకపోకలు పునరుద్ధరణ..
Quick Summary:
కవిరాజు