వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి జైలు శిక్ష..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, జూన్ 29 మన వార్త :అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి మేడ్చల్ ప్రధాన జిల్లా సెషన్స్ కోర్టు జైలు శిక్ష విధించింది.
అల్వాల్ ఎస్‌హెచ్‌ఓ తెలిపిన వివరాల ప్రకారం అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో 2020లో క్రైమ్ నెం. 227/2020గా భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 307, 498-ఏతో పాటు వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్లు 3, 4 కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసు ఎస్‌సీ నెం. 462/2021గా మేడ్చల్ ప్రధాన జిల్లా సెషన్స్ కోర్టులో విచారణకు వచ్చింది.
విచారణలో నేరం రుజువుకావడంతో నిందితుడు చెరుకు రోహిత్ కుమార్ (39)కు న్యాయస్థానం ఒక సంవత్సరం ఆరు నెలల సాధారణ జైలు శిక్ష (సింపుల్ ఇంప్రిజన్‌మెంట్) తో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.
ఈ కేసులో అల్వాల్ పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహించి, అవసరమైన సాక్ష్యాధారాలను కోర్టు ముందు సమర్పించడంతో నిందితుడిపై అభియోగాలు రుజువైనట్లు కోర్టు పేర్కొంది. ఈ విషయాన్ని అల్వాల్ ఎస్‌హెచ్‌ఓ వెల్లడించారు.
Medchal -Malkajgiri District
వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి జైలు శిక్ష..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని