జనప్రియ షెల్టర్స్ – స్నేహ ఎన్‌క్లేవ్‌లో అధ్వానంగా రహదారి,
గుంతలమయమైన రోడ్డుపై నిలిచిన మురుగునీరు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు..
కంటోన్మెంట్ బొల్లారం, నవంబర్ 2 మన వార్త : బొల్లారం పరిధిలోని జనప్రియ షెల్టర్స్ స్నేహ ఎన్‌క్లేవ్‌లో రహదారి పరిస్థితి అధ్వానంగా మారింది. కాలనీలోని రోడ్డు పూర్తిగా గుంతలమయమై, వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డుపై ఏర్పడిన పెద్దపెద్ద గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో గుంతల లోతు తెలియక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వాహనాల రాకపోకలతో బురద చిమ్ముతూ పరిసరాలు కూడా అపరిశుభ్రంగా మారుతున్నాయి.
కాలనీ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది. సంబంధిత కంటోన్మెంట్ బోర్డ్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి జనప్రియ షెల్టర్స్ స్నేహ ఎన్‌క్లేవ్‌లో రహదారి మరమ్మతులు చేపట్టి, నాణ్యమైన సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Medchall -Malkajgiri district
జనప్రియ షెల్టర్స్ – స్నేహ ఎన్‌క్లేవ్‌లో అధ్వానంగా రహదారి, గుంతలమయమైన రోడ్డుపై నిలిచిన మురుగునీరు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు..
Quick Summary:
మన వార్త ప్రతినిధి : అంతోని
