తుర్కపల్లి బొల్లారంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన, 190 డివిజన్ అధ్యక్షుడు లడ్డు రెడ్డి..
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, జూన్ 25 మన వార్త: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం 190వ డివిజన్ పరిధిలోని తుర్కపల్లి బొల్లారంలో ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే మైనాంపల్లి హనుమంత రావు ఆదేశాల మేరకు, మల్కాజ్‌గిరి ఇన్‌చార్జ్ తోట లక్ష్మి కాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తుర్కపల్లి డివిజన్ అధ్యక్షుడు లడ్డు రెడ్డి ప్రారంభించి అర్హులైన మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లడ్డు రెడ్డి మాట్లాడుతూ, మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ చీరల పథకం ద్వారా పేద, మధ్యతరగతి మహిళలకు ఆర్థిక భారం కొంత మేర తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్, కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, వెంకటేష్ గౌడ్, దేవా, డి. స్వామి, వెంకటేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.అలాగే మహిళా నాయకురాలు లావణ్య, డీసీసీ జనరల్ సెక్రటరీ భబిత, కవిత, నీత గ్లోరీ, లక్ష్మి, సుకన్య, సరోజ, నిర్మల తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని చీరలను స్వీకరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తమకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. కార్యక్రమం నిర్వహణలో ప్రత్యేక చొరవ చూపిన తుర్కపల్లి డివిజన్ అధ్యక్షుడు లడ్డు రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. 190వ డివిజన్‌లో ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలులో తుర్కపల్లి డివిజన్ అధ్యక్షుడు లడ్డు రెడ్డి ముందుండి పనిచేస్తున్నారని స్థానికులు అభినందించారు.
Medchal -Malkajgiri District
తుర్కపల్లి బొల్లారంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన, 190 డివిజన్ అధ్యక్షుడు లడ్డు రెడ్డి..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని