మంచిర్యాల,జులై 26 (మన వార్త ప్రతినిధి);
ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.మంచిర్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం,నస్పూర్ మండలంలోని సీతారాంపల్లి గ్రామానికి చెందిన పాదం కార్తీక్ ద్విచక్ర వాహనంపై ర్యాలిగడ్‌పూర్‌లోని ఏసీసీ క్వారీ సమీపంలో వెళ్తుండగా,ఒక్కసారిగా వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.దీంతో రోడ్డుపక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో కార్తీక్ తీవ్రంగా గాయపడగా,చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు తెలిపారు.వాహనంపై నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి అకాల మృతితో సీతారాంపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.కార్తీక్ మృతిని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు,బంధువులు,స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను కలచివేసింది.
Telangana
చెట్టును ఢీకొని యువకుడు మృతి
Quick Summary:
మన వార్త ప్రతినిధి