రాజన్న సిరిసిల్ల,ఇల్లంతకుంట, జూలై 20 (మన వార్త )
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే హెచ్-143) ఉద్యమ కార్యాచరణను మరింత వేగవంతం చేసింది. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయడంలో జరుగుతున్న జాప్యంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ నెల 21వ తేదీ మంగళవారం ఉదయం 10:30 గంటలకు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించే "చలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఇల్లంతకుంట మండల ప్రెస్ క్లబ్‌లో టీయూడబ్ల్యూజే హెచ్-143 సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా పాల్గొని సభ్యత్వాలను నమోదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. ముఖ్యంగా అక్రిడిటేషన్ కార్డుల జారీ ఆలస్యం కావడంతో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు కలెక్టరేట్ ఎదుట నిరసన నిర్వహించి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.
జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్యతే బలమని, సంఘం చేపట్టే ఉద్యమాలకు ప్రతి పాత్రికేయుడు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పరుశురాం, జిల్లా క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రసూల్, జిల్లా కమిటీ సభ్యుడు కమటాల విజయ్, వేములవాడ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ, సీనియర్ పాత్రికేయుడు మోహన్‌తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
టీయూడబ్ల్యూజే హెచ్-143 జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఒకవైపు సంఘాన్ని బలోపేతం చేస్తూనే, మరోవైపు జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఇల్లంతకుంటలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం, వెంటనే చేపట్టనున్న "చలో కలెక్టరేట్" పిలుపు జిల్లాలో జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేసే చర్యగా భావించవచ్చు. అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం కావాలని జర్నలిస్టుల నుంచి వస్తున్న డిమాండ్‌కు ఈ నిరసన కార్యక్రమం కీలక వేదికగా మారే అవకాశం ఉంది.
Telangana
*అక్రిడిటేషన్ జాప్యంపై గళమెత్తిన జర్నలిస్టులు* -- 'చలో కలెక్టరేట్' విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే హెచ్-143 పిలుపు. -- ఇల్లంతకుంటలో సభ్యత్వ నమోదు – జిల్లా వ్యాప్తంగా ఐక్యతకు నాంది. -- జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా..
Quick Summary:
ఇల్లంతకుంట మండలం