అల్వాల్‌లో విషాదం కరెంట్ షాక్‌తో తండ్రి, కూతురు మృతి
టెలికం కాలనీలో దుర్ఘటన.. వర్షం తర్వాత ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూన్ 13 మన వార్త :మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్ పరిధిలోని టెలికం కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై తండ్రి, కూతురు మృతి చెందడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే ప్రకారం, శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఓ చెట్టు విరిగి విద్యుత్ వైర్లపై పడింది. దీంతో విద్యుత్ తీగలు ప్రమాదకర స్థితిలో నేలపైకి వేలాడుతూ ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో టెలికం కాలనీలో నివాసం ఉంటున్న సందీప్ (45), ఆయన కుమార్తె రితిక (16) తమ కారును అక్కడి నుంచి తరలించేందుకు వెళ్లారు.ఈ క్రమంలో కారుకు లేదా సమీపంలో ఉన్న విద్యుత్ తీగలకు అనుకోకుండా తాకడంతో ఇద్దరూ తీవ్ర విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనతో టెలికం కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కూతురు మృతి చెందడం స్థానికులను కలచివేసింది. వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Medchal -Malkajgiri District
అల్వాల్‌లో విషాదం కరెంట్ షాక్‌తో తండ్రి, కూతురు మృతి టెలికం కాలనీలో దుర్ఘటన.. వర్షం తర్వాత ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని
