ములుగు జిల్లాలోని రేషన్ కార్డుదారులందరికీ ఈ-కేవైసీ (e-KYC) తప్పనిసరి: రేషన్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండటానికి వెంటనే (e-KYC) పూర్తి చేయండి
ములుగు జులై 23 మనవార్త
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) రాష్ట్ర ఆహార భద్రతా కార్డుల (FSC) కింద నమోదైన లబ్ధిదారులందరికీ ఈ-కేవైసీ (e-KYC) సరిచూడటం తప్పనిసరి చేసినట్టు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు.రేషన్ కార్డులో పేరు నమోదైన ప్రతి ఒక్కరూ తమ బయోమెట్రిక్ ప్రామాణీకరణను (ఆధార్ ఇ-కేవైసీ) పూర్తి చేయాలి. ప్రజలు కింది మార్గదర్శకాలను గమనించవలసిందిగా సూచించడమైనది. లబ్ధిదారులు e-KYC ప్రక్రియను పూర్తి చేయడానికి తమ సమీపంలోని చౌక ధరల దుకాణాన్ని (రేషన్ షాప్) సందర్శించగలరు. ఏ విధమైన రుసుము చెల్లించవలసిన అవసరం లేదు, లబ్ధిదారులు తమ అసలు రేషన్ కార్డు, ఆధార్ కార్డును రేషన్ షాపుకి తీసుకెళ్ళాలి.కార్డులో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు ఇ-పాస్ (ePoS) యంత్రంపై వ్యక్తిగతంగా తమ వేలిముద్రలను వేయాలి.నిర్దేశిత గడువు అనగా తేది.31/07/2026 లోపు లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే, వారి యూనిట్ తొలగించబడుతుంది ఆ వ్యక్తికి పంపిణీ చేసిన రాయితీ సరకుల సరఫరా నిలిపివేయబడుతుంది.ప్రతి నెల ఇచ్చే ఉచిత/రాయితీ రేషన్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటానికి పౌర సరఫరాల శాఖకు సహకరించి, గడువు ముగిసేలోపు వెంటనే తమ రేషన్ షాపును సందర్శించి ఈ-కేవైసీ ప్రామాణీకరణను పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం లబ్ధిదారులందరికీ తెలియజేయనైనది.
Telangana
జులై 31 లోపు రేషన్ కార్డులందరు e-kyc చేయించండి. లేకుంటే బియ్యం బంద్..
Quick Summary:
కవిరాజు