BBMA Police e-News
Thu, Oct 29, 2026
YouTube
జొన్న బండ డివైన్ హోమ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, మూడో అంతస్తులోని ఫ్లాట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ప్రాణనష్టం లేదు.. అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు.. పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు.. కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు..రేపు,ఎల్లుండి పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో.. 22/ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని వినతి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల వినతిపత్రం.. మచ్చ బొల్లారం ప్రజల చిరకాల నిరీక్షణకు తెర త్వరలో సీసీ రోడ్డు పనులు, మైనంపల్లి హనుమంతరావు చిత్రపటానికి పాలాభిషేకం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కృషి.. హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ప్రజా సేవలో ముందుండే తుర్కపల్లి బొల్లారం కాంగ్రెస్ నాయకుడు లడ్డూ రెడ్డి.. సోషల్‌ మీడియా గ్రూపుల్లో అప్రమత్తంగా ఉండాలి..ప్రజలకు ఎస్సై ఉపేంద్ర చారి సూచన.. అల్వాల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 20వ నెల అన్నదానం ప్రతి నెలా 500 మందికి అన్నప్రసాద వితరణ.. పీఎం సాయిప్రసాద్ – పద్మిని వివాదంపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ విచారణ, పద్మిని నివాసానికి వెళ్లి వివరాలు సేకరించిన కమిటీ సభ్యులు.. జొన్న బండ డివైన్ హోమ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, మూడో అంతస్తులోని ఫ్లాట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ప్రాణనష్టం లేదు.. అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు.. పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు.. కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు..రేపు,ఎల్లుండి పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో.. 22/ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని వినతి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల వినతిపత్రం.. మచ్చ బొల్లారం ప్రజల చిరకాల నిరీక్షణకు తెర త్వరలో సీసీ రోడ్డు పనులు, మైనంపల్లి హనుమంతరావు చిత్రపటానికి పాలాభిషేకం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కృషి.. హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ప్రజా సేవలో ముందుండే తుర్కపల్లి బొల్లారం కాంగ్రెస్ నాయకుడు లడ్డూ రెడ్డి.. సోషల్‌ మీడియా గ్రూపుల్లో అప్రమత్తంగా ఉండాలి..ప్రజలకు ఎస్సై ఉపేంద్ర చారి సూచన.. అల్వాల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 20వ నెల అన్నదానం ప్రతి నెలా 500 మందికి అన్నప్రసాద వితరణ.. పీఎం సాయిప్రసాద్ – పద్మిని వివాదంపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ విచారణ, పద్మిని నివాసానికి వెళ్లి వివరాలు సేకరించిన కమిటీ సభ్యులు..
తాజా వార్తలు
జొన్న బండ డివైన్ హోమ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, మూడో అంతస్తులోని ఫ్లాట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ప్రాణనష్టం లేదు.. అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత
అల్వాల్‌లో ‘మీ సురక్ష సహచరి" అవగాహన కార్యక్రమం, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన, డ్రగ్స్ వినియోగం, విక్రయాల సమాచారం 1908కు ఇవ్వాలి: పోలీసుల పిలుపు.. - Rivx Studios
Medchall -Malkajgiri district

అల్వాల్‌లో ‘మీ సురక్ష సహచరి" అవగాహన కార్యక్రమం, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన, డ్రగ్స్ వినియోగం, విక్రయాల సమాచారం 1908కు ఇవ్వాలి: పోలీసుల పిలుపు..

Published on September 16, 2026 at 3:03 AM

1,256 Views

Quick Summary:

మన వార్త ప్రతినిధి : అంతోని

అల్వాల్‌లో ‘మీ సురక్ష సహచరి" అవగాహన కార్యక్రమం,

మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన,

డ్రగ్స్ వినియోగం, విక్రయాల సమాచారం 1908కు ఇవ్వాలి: పోలీసుల పిలుపు..

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సెప్టెంబర్ 16, మన వార్త: మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ అధికారులు పిలుపునిచ్చారు. మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, ఆహార భద్రత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అల్వాల్‌లో ‘మీ సురక్ష సహచరి’ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

మంగళవారం సాయంత్రం అల్వాల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని గణేష్ మండపం వద్ద ఏహెచ్‌ఏ ప్రశాంత్ ఆధ్వర్యంలో ‘సే నో టు డ్రగ్స్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బేగంపేట డివిజన్ ఏసీపీ పి.గోపాలకృష్ణమూర్తి, నార్కోటిక్ బ్యూరో ఏసీపీ హరీష్ చంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏసీపీలు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను, ముఖ్యంగా యువతపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు. డ్రగ్స్‌కు అలవాటు పడటం వల్ల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ, సామాజిక జీవితంపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసులు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు, విద్యార్థులు,యువత, స్థానిక ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా భాగస్వాములు కావాలని సూచించారు.

అలాగే సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మహిళల భద్రతకు సంబంధించిన అంశాల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, ప్రజలు రోడ్డు భద్రతపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఆహార భద్రత విషయంలోనూ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు.

కమ్యూనిటీ పరిధిలో ఎవరైనా మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నా, విక్రయిస్తున్నా లేదా వాటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే 1908 టోల్‌ ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని అధికారులు కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

కార్యక్రమంలో డీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com