టేకులగూడెం లో అర్రీవ్ ఎలైవ్ అవగాహన - క్షేమంగా గమ్యం చేరండి పేరూరు పోలీస్
వాజేడు జులై 17 మనవార్త
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన *సురక్షితంగా చేరుకోండి ఎర్రీవ్ ఎలైవ్ అవగాహన కార్యక్రమం ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో* నిర్వహించారు.పేరూరు పోలీస్ స్టేషన్ పోలీసుల ఆధ్వర్యంలో గ్రామంలో బ్యానర్ ఏర్పాటు చేసి వాహనదారులకు అవగాహన కల్పించారు.*సెల్ మాట్లాడుతూ బండి నడపకండి, మద్యం సేవించి వాహనం నడపకండి, పరిమితికి మించి ప్రయాణించొద్దు, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ తప్పక ధరించవలెను* అనే ముఖ్య సూచనలను పోలీసులు ప్రజలకు తెలియజేశారు.క్షేమంగా మీ గమ్య స్థానాలకు చేరండి" అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని సివిల్ పోలీసులు, హోంగార్డ్ కోరారు.
Telangana
పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమం
Quick Summary:
కవిరాజు