Telangana
మాజీ సీఎంను కలిసిన గజ్వేల్ మాజీ చైర్మన్
Quick Summary:
MURALI STAFF REPORTER
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఎన్.సి. రాజమౌళి మాజీ సీఎం కేసీఆర్ ను ఎర్రవల్లిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి జరుగుతున్న కృషిని కేసీఆర్ కు వివరించారు. గతంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్‌గా సేవలు అందించేందుకు, పట్టణ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినందుకు కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల సమస్యలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల బలాబలాలపై అధినేతతో చర్చించారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలతో నిరంతరం మమేకమై ఉండాలని, ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారని ఎన్.సి. రాజమౌళి అన్నారు.